భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో మండల కేంద్రం ఇనుగుర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయానికి చెందిన 8 మంది విద్యార్థినిలు టాపర్లుగా నిలిచారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 46 మంది విద్యార్థినిలు ఉండగా 32 మంది పాసై 70%, ద్వితీయ సంవత్సరంలో 56 మందికి 45 మంది పాసై 80 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ సెకండియర్ సీఈసీలో ఎస్. శరణ్య 937/1000, ఎస్. ప్రవళిక 920/1000, హెచ్ఈసీలో బి. శ్రీవల్లి 948/1000, ఆర్. మనిత 879/1000, ఫస్ట్ ఇయర్ హెచ్ఈసీలో బి. హరిని 473/500, కే లావణ్య 429/500, సీఈసీలో జి. ప్రణవి 432/500, పి. భవాని 417/500 అత్యధిక మార్కులు సాధించి కళాశాల ర్యాంకర్లుగా నిలిచారు.
BHARATH SAMACHAR DIGITAL
13, ఏప్రిల్ 2026, సోమవారంభారత్ సమాచార్