భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, ఆగస్టు 2025, ఆదివారంభారత్ సమాచార్

ప్రేమలో గెలిచి.. భార్యను కిరాతంగా చంపి..!

medchal-women-murder (1)

భారత్ సమాచార్, మేడ్చల్‌ జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మేడిపల్లి మండల పరిధిలోని బాలాజీహిల్స్‌లో చోటు చేసుకుంది. కామారెడ్డిగూడకు చెందిన జ్యోతి, మహేందర్‌రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ నెలరోజుల క్రితం బోడుప్పల్‌కు వచ్చి శ్రీనివాసనగర్‌లో ఉంటున్నారు. మహేందర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గర్భవతి అయిన భార్య జ్యోతిని భర్త హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే వెళ్లి నిందితుడు మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయట ఏమైనా శరీర భాగాల పడేశాడా అని పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి తల్లిదండ్రులు, బంధువులు చెప్పిమరి తన బిడ్డను చంపేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడు మహేందర్‌రెడ్డి ప్రవర్తన వింతగా ఉండేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. భార్యను అత్యంత కిరాతకంగా చంపిన అనంతరం శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేశాడు. తలతోపాటు కొన్ని శరీరభాగాలను కవర్‌లో పెట్టి పడేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో గదిలో శబ్దాలు విన్న స్థానికులు వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం బయటకు పొక్కింది.

మరిన్ని కథనాలు: 

దారుణం.. యువతిపై ప‌ది మంది సామూహిక అత్యాచారం