భారత్ సమాచార్, మేడ్చల్‌ జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మేడిపల్లి మండల పరిధిలోని బాలాజీహిల్స్‌లో చోటు చేసుకుంది. కామారెడ్డిగూడకు చెందిన జ్యోతి, మహేందర్‌రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ నెలరోజుల క్రితం బోడుప్పల్‌కు వచ్చి శ్రీనివాసనగర్‌లో ఉంటున్నారు. మహేందర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గర్భవతి అయిన భార్య జ్యోతిని భర్త హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే వెళ్లి నిందితుడు మహేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి…