భారత్ సమాచార్.నెట్, వరంగల్: అదనపు కట్నం కోసం వివాహమైన నాలుగు నెలలకే ఒక భర్త తన భార్యను దారుణంగా హత్య చేసిన దారుణ ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. హంటర్ రోడ్డులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న గణేష్ (22), తన భార్య గౌతమి (21) ని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, వీరారం గ్రామం. అదనపు కట్నం కోసమే తన కూతురిని గణేష్ హత్య చేశాడని గౌతమి తండ్రి అశోక్ ఆరోపించారు. ఈ దారుణంపై మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో గౌతమి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, నగరంలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని కథనాలు
వర్షపు నీటిలో మంచంపై రోగిని తరలించిన గ్రామస్థులు