భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, ఏప్రిల్ 2026, మంగళవారంభారత్ సమాచార్

అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

ai

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మెయిన్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు భారతీనగర్ డివిజన్‌లోని మ్యాక్ సొసైటీ ESI రోడ్ మరియు మ్యాక్ సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పటాన్‌చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు మరియు భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ గారి గౌరవార్థం 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించిందని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని మూసివేసి ఉంచడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్,నరసింహ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాటి సత్యనారాయణ, దేవేంద్ర చారి, భాస్కర్ ముదిరాజ్, అప్పల భాస్కర్, రాములు, శ్రీకాంత్ రెడ్డి, ఐలేష్ యాదవ్, సురేందర్, సంపత్ గౌడ్, విఠల్ రెడ్డి, రమేష్, వెంకట్ రెడ్డి, జాకిర్, నరేష్, మైనారిటీ నాయకులు అజీముద్దీన్, కుతుబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గాబాయి మహిళా మండలి అధ్యక్షురాలు కళ్యాణి గారు, సభ్యులు సుజాత, నిర్మల, జ్యోతి గారు మరియు మ్యాక్ సొసైటీ డైరెక్టర్లు సలీం, నందగోపాల్, రామారావు, దుర్గారెడ్డి గారు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కాలనీ సభ్యులు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు.