భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, ఏప్రిల్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మాదారం గ్రామంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు

ak

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా మాదారం గ్రామంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసంగిస్తూ
ప్రపంచ మేధావి, న్యాయ శాస్త్ర కోవిదుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాట చేసిన వీరుడు, రాజ్యాంగ నిర్మాత,భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రివర్యులు,
ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త,రాజకీయ దార్శనికుడు,సంఘ సంస్కర్తవిధ్యా ప్రదాత
అసమానతలు ,అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా ఎగరేసి బోధించు, సమీకరించు, పోరాడు
అంటూ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన
సామాజిక విప్లవకారుడు,అనగారిన వర్గాల ఆశాజ్యోతి,భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ అని చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గడ్డ పోతారం మున్సిపాలిటీ అధికారులు వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కౌన్సిలర్స్ మల్లేష్, గణేష్, నవీన్ మరియు మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, AISSD రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్నా కే అంబదాస్,BRS గ్రామ అధ్యక్షులు గడ్డ మీద గణేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు గౌడ్ ,JAC నాయకులు విజయ్ గౌడ్, వెంకటేశ్ గౌడ్, లక్ష్మణ్ , చందు,AISSD అధ్యక్షుడు బోడపట్ల సంపత్ కుమార్, మాజీ అధ్యక్షుడు అరబ్ గూడెం రాజు,సుదర్శన్, గ్రామ వివిధ యువజన సంఘాల నాయకులు, యువకులు, పిల్లలు, స్రీలు పాల్గొని విజయవంతం చేశారు.