భారత్ సమాచార్.నెట్, కొమరంభీం: అర్ధరాత్రి ప్రియుడు ఇంటికి రావడంతో కుటుంబీకులు, గ్రామస్థుల నిలదీతకు మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కౌటాల మండలం వైగాం గ్రామంలో జరిగింది. మృతురాలు ఉరుకుడే అశ్విని (20)గా పోలీసులు గుర్తించారు. ఈ నెల 17న రాత్రి అశ్విని ప్రియుడు జాబరి ప్రవీణ్ ఆమె ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి అశ్విని సోదరుడు ఇంద్రదాస్ గమనించి ప్రవీణ్‌ను నిలదీశాడు. దీంతో తామిద్దరం ప్రేమించుకుంటున్నామని ప్రవీణ్ చెప్పాడు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి నిలదీతకు అవమానంగా భావించిన అశ్విని, మనస్తాపంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను కాగజ్‌నగర్, మంచిర్యాల ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మరణించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు
రైలు ప్రమాదం.. కూలీ మృతి, మరొకరికి గాయాలు