భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నిజాంపేట నుంచి జడ్చరుతాండకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకర గుంతలను మంగళవారం పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పూడ్చివేసింది. గతంలో ఈ మార్గంలో ఉన్న గుంతల కారణంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజాంపేట్ ఎస్సై రాజేష్, జడ్చరుతాండ సర్పంచ్ ఆధ్వర్యంలో గుంతలను గుర్తించి, మట్టి మరియు కంకరతో వాటిని నింపారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ.. వాహనదారుల ప్రాణ భద్రత తమకు ముఖ్యమని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా రోడ్లపై గుంతలు ఉంటే గుర్తించి, తమ దృష్టికి తీసుకురావాలని లేదా స్వచ్ఛందంగా పూడ్చివేసి ప్రమాదాలను అరికట్టాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.
BHARATH SAMACHAR DIGITAL
15, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్