భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నిజాంపేట నుంచి జడ్చరుతాండకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకర గుంతలను మంగళవారం పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పూడ్చివేసింది. గతంలో ఈ మార్గంలో ఉన్న గుంతల కారణంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజాంపేట్ ఎస్సై రాజేష్, జడ్చరుతాండ సర్పంచ్ ఆధ్వర్యంలో గుంతలను గుర్తించి, మట్టి మరియు కంకరతో వాటిని నింపారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ.. వాహనదారుల ప్రాణ భద్రత తమకు ముఖ్యమని, ప్రమాదాల నివారణకు…