భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్

త్రిపురారం ఎస్సై ఆధ్వర్యంలో మానవహారం

WhatsApp Image 2026-04-14 at 8.19.54 PM

భారత్ సమాచార్.నెట్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎస్సై కైగురి నరేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. త్రిపురారం గ్రామం నడిబొడ్డున రాజకీయ ప్రముఖులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బందితో కలిసి భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ చిన్నతనం నుంచే వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, బడుగు బలహీన వర్గాల వికాసానికి బాటలు వేశారని కొనియాడారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.