భారత్ సమాచార్.నెట్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎస్సై కైగురి నరేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. త్రిపురారం గ్రామం నడిబొడ్డున రాజకీయ ప్రముఖులు, దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బందితో కలిసి భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఎస్సై నరేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ చిన్నతనం నుంచే వివక్షకు…

