భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, ఏప్రిల్ 2026, బుధవారంభారత్ సమాచార్

రాజ్యాంగం వల్లే ఈ హోదాలో ఉన్నాను: ఎస్సై

WhatsApp Image 2026-04-14 at 8.20.47 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రామాయంపేట ఎస్సై బాలరాజు, స్థానిక సర్పంచ్ స్రవంతి రాజేందర్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు మాట్లాడుతూ.. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం వల్లనే తాను ఈరోజు ఎస్సై పదవిలో ఉన్నానని ఉద్వేగంగా చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు.

అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమం నిర్వహించి, రోడ్డు భద్రతపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలరాజు, సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, ఉప సర్పంచ్ బాబు నాయక్, గ్రామ కార్యదర్శి ధనలక్ష్మి, వార్డు సభ్యులు బిల్లం మల్లారెడ్డి, మనవ, సందీప్ కుమార్, మైలారం బాబు, భారతి, శనిశెట్టి సందీప్ కుమార్ గుప్తా, మైలారం లావణ్య, కాట్రియాల రిబుక, మైలారం శ్యామల, మాజీ సర్పంచ్ మైలారం శ్యామ్, భిక్షపతి, కట్ట డాక్టర్ చంద్రం, అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు మైలారం బాబు, ఉపాధ్యక్షులు కమల్, రాగిశెట్టి ప్రశాంత్, క్యాషియర్ మైలారం శ్రీధర్, రాజు, భాను, శ్రీకాంత్, స్వామి, రవి కిషన్ తదితరులు పాల్గొన్నారు.