భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రామాయంపేట ఎస్సై బాలరాజు, స్థానిక సర్పంచ్ స్రవంతి రాజేందర్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు మాట్లాడుతూ.. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం వల్లనే తాను ఈరోజు ఎస్సై పదవిలో ఉన్నానని ఉద్వేగంగా చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ…