భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు చేగుంట మండలం కరీంనగర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదల, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ అధ్యక్షులు తిరుపతి, టీఆర్‌టీఎఫ్ అధ్యక్షులు జగన్ లాల్, మనోహర్ రావు, నరసింహారావు, బాల పోచయ్య, హెచ్ఎంలు కృష్ణారెడ్డి, పూర్ణచందర్, జేఏసి నాయకులు వవి జయందర్, ధర్ రెడ్డి కిషన్, నాగరాజు, వాణి, విజయలక్ష్మి, స్వప్న, ఎస్జీటీ యూనియన్ నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
18, ఏప్రిల్ 2026, శనివారంభారత్ సమాచార్