భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, ఏప్రిల్ 2026, శనివారంభారత్ సమాచార్

సోషల్ ఫోరం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం

WhatsApp Image 2026-04-17 at 7.46.51 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాలో మోడల్ యునైటెడ్ నేషన్స్ నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారి వి. రాజేశ్వరరావు సానుకూలత వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నేతలు, సోషల్ ఫోరం ప్రతినిధులు డీఈవోను ఆయన ఛాంబర్‌లో కలిసి, ఐక్యరాజ్యసమితి విద్యా అనుకరణ కార్యక్రమ నిర్వహణకు అనుమతి కోరారు. దీనిపై డీఈవో సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేసినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా సోషల్ ఫోరం డైరీని డీఈవోకు అందజేశారు. డీఈవోను కలిసిన వారిలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సతీష్ రెడ్డి, సీహెచ్. శ్రీధర్, సోషల్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం.ఏ. అంజుమ్ సుల్తానా, ఏఐఎఫ్టీవో నేతలు ఎన్. గీత, డి.వెంకన్న, బ్రహ్మానంద రెడ్డి తదితరులు ఉన్నారు. విద్యార్థుల్లో అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.