భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, ఆగస్టు 2025, బుధవారంభారత్ సమాచార్

ఉరేసుకొని మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

11

భార‌త్ స‌మాచార్.నెట్, శ్రీ‌కాకుళం: కుటుంబ స‌భ్యులు మంద‌లిస్తార‌నే భ‌యంతో ఓ మ‌హిళ ఉరేసుకొని ఆత్మ‌హత్య చేసుకున్న ఘ‌ట‌న పాతపట్నం పంచాయతీ పరిధిలోని ప్రశాంతినగర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. రాజస్థాన్ కు చెందిన హీరారామ్ చౌదరి, దీపికా కుమారి భార్యాభర్తలు. హార్డ్ వేర్ దుకాణం నిర్వహిస్తూ హీరారామ్ చౌదరి, సోదరుడు, బావ, మామయ్య అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు రాజస్థాన్ వెళ్లగా భార్యాభర్తలు, మరిది ఉంటున్నారు. ఈనెల 25న సోదరులు ఇద్దరూ పనికి వెళ్లగా దీపికాకుమారి ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఎవరో తలుపు కొట్టినట్లు శబ్దం రావడంతో భర్తకు ఫోన్ చేసి తెలిపారు. ఆయన ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎవరో బయట వ్యక్తి అనుకుని మరుగుదొడ్లు శుభ్రపరచడానికి ఉపయోగించే రసాయనాన్ని వేయడంతో కంట్లో పడింది. వైద్యులను సంప్రదించగా కంటిచూపు దెబ్బతినే అవకాశముందని తెలిపారు. తన వల్ల సమస్య వచ్చిందని, కుటుంబ సభ్యులు మందలిస్తారనే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. పని ముగించుకుని వచ్చిన మరిది చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. లావణ్య పేర్కొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

‘అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం’