భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

యూరియా కోసం రైతుల నిర‌స‌న‌

01

భార‌త్ స‌మాచార్‌.నెట్, నారాయణపేట: జిల్లా కేంద్రంలో యూరియా లభ్యతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. బస్టాండ్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తమకు సరిపడినంత యూరియాను అధికారులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న నారాయణపేట ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, అధికారులు వచ్చి యూరియా సరఫరాపై హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు. దీంతో ఎస్సై వెంకటేశ్వర్లు నారాయణపేట ఏవోతో ఫోన్‌లో మాట్లాడారు. సాయంత్రానికల్లా 800 బస్తాల యూరియా వస్తుందని ఏవో హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: చిట్టెం రామ్మోహన్ రెడ్డి