భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, సెప్టెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

443bd20c-2eb7-4238-9905-aaf485d48495

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: కోహెడ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టు గ్రామం పోరెడ్డిపల్లిలో ఇండ్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇండ్ల లబ్దిదారులందరూ తర్వగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, మండల అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డివో జయదేవ్, ఎంపిడివో కృష్ణయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, ఎంపీవో శోభ, హౌసింగ్ ఏఈ రహీమ్, పంచాయతీ కార్యదర్శులు జ్యోతి, శ్రీకాంత్, రవి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి మంద శ్రీనాథ్ మహర్షి, ఇందిరమ్మ కమిటి సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.