భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, ఏప్రిల్ 2026, గురువారంభారత్ సమాచార్

ధరిత్రి సంరక్షణ మన అందరి బాధ్యత

WhatsApp Image 2026-04-22 at 12.23.20 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండలం, నాగులపల్లి ZPHS పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రీన్ టీచర్ డి. ప్రసన్న కుమార్ నేతృత్వంలో విద్యార్థులతో “ధరిత్రి సంరక్షణ” ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా “సేవ్ ఎర్త్ – సేవ్ ఫ్యూచర్” ఇతివృత్తంతో పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, ప్రసంగం, నాటిక పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను విడనాడి, ప్రకృతి వనరులను కాపాడాలని ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. కరుణ, అరుణ, స్వర్ణలత, అనంతరాం గౌడ్, ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.