భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ మండలం, నాగులపల్లి ZPHS పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రీన్ టీచర్ డి. ప్రసన్న కుమార్ నేతృత్వంలో విద్యార్థులతో “ధరిత్రి సంరక్షణ” ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా “సేవ్ ఎర్త్ – సేవ్ ఫ్యూచర్” ఇతివృత్తంతో పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, ప్రసంగం, నాటిక పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ…