భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

త్రిపురారంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

WhatsApp Image 2026-05-02 at 2.06.50 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నల్గొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. త్రిపురారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాటూరు సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, మాటూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు వాంకుడోతు శ్రావణి, వాంకుడోతు స్వాతి, వాంకుడోతు రేణుక, ధానావత్ స్వాతి, ధానావత్ అంజలి, వాంకుడోతు ఝాన్సీలకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముడిమల్ల బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ, శ్రీనివాస రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, నిడమానూరు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాటూరు సర్పంచ్ ధానావత్ వెంకట్రాం నాయక్, మండల ఆర్ఐ సైదులు తదితరులు పాల్గొన్నారు.