భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లోని బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRIT) కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన “రతన్ టాటా బ్లాక్ – విష్ణు స్కూల్ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్” భవనాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ విభాగ అధ్యక్షులు శ్రీ వి. రాజన్న ముఖ్య అతిథిగా హాజరై భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వి. రాజన్న మాట్లాడుతూ.. రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. టాటా నైతిక విలువలు, కష్టపడి పనిచేసే తత్వం ప్రతి విద్యార్థికి ఆదర్శమని కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉండదని, ఇది కొత్త పాఠాలు నేర్చుకోవడానికి, తక్కువ సమయంలో సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గమని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కె.వి. విష్ణు రాజు మాట్లాడుతూ.. తమ విద్యాసంస్థల్లో మేనేజ్మెంట్ విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ఇంజినీరింగ్‌తో పాటు మేనేజ్మెంట్, హ్యూమానిటీస్ విభాగాల్లో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, అందుకోసమే అత్యాధునిక వసతులతో ఈ నూతన బ్లాక్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ఛైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే, మేనేజ్మెంట్ విభాగాధిపతి డా. ఐ. నాగేశ్వరరావు, కళాశాల మేనేజర్ బి. బాపిరాజు , ఏవో సురేశ్, ఇండస్ట్రీ రిలేషన్స్ డైరెక్టర్ పి. సతీష్ చంద్ర, రవి కిరణ్, డా. ఏ. రాజు, డా. శివకృష్ణన్, వివిధ ఇంజినీరింగ్ విభాగాధిపతులు, డీన్లు, ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.