భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, మే 2026, శనివారంభారత్ సమాచార్

పశుగ్రాస విత్తనాల పంపిణీ

WhatsApp Image 2026-05-08 at 2.46.42 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ డాక్టర్ చిర్ర యాకాంతం గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పశుగ్రాస విత్తనాలను మరియు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలతో పాటు పెంపకంలో పాటించాల్సిన మెళకువలపై రైతులకు అవగాహన కల్పించారు. వైద్య సేవలలో భాగంగా 96 పశువులకు, 112 గొర్రెలు మరియు మేకలకు, 150 కోళ్లకు, అలాగే 5 పెంపుడు కుక్కలకు టీకాలు, చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు బోల్లు మురళీ, కార్యదర్శి ఎర్ర రవి, మండల పశువైద్యాధికారులు డా.సోమ శ్రీనివాస్, డా.తేజవత్ వెంకన్న, కుమార్, సత్యనారాయణ, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.