భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, మే 2026, శనివారంభారత్ సమాచార్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వెంకటరామిరెడ్డి

WhatsApp Image 2026-05-08 at 3.46.36 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: శివంపేట మండలంలో పీఏసీఎస్ ఛైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తొలుత మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వ్యవసాయ అధికారి తుమ్మల నాగేశ్వరరావు అందజేసిన నూతన ఆర్డర్ కాపీని, సీఈవో గొల్ల మధు యాదవ్ చేతుల మీదుగా వెంకటరామిరెడ్డి స్వీకరించారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా గంగాయపల్లి మరియు శభాష్‌పల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను ప్రోత్సహించే దిశగా దంతాన్‌పల్లి గ్రామానికి చెందిన నిమ్మల పోషన్‌రావుకు వరిగడ్డి కట్టే మిషన్‌ను, గొల్ల గణేష్‌కు రోటావేటర్‌ను 50 శాతం సబ్సిడీపై అందజేశారు. అదేవిధంగా, కొంతాన్‌పల్లి, పోతులబొగుడ గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు మాధవరెడ్డి, పులిమామిడి నవీన్ గుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు బుర్ర మురళి గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.