భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, మే 2026, శనివారంభారత్ సమాచార్

మక్కల కొనుగోళ్ల జాప్యం.. రోడ్డెక్కిన రైతన్నలు

WhatsApp Image 2026-05-08 at 8.42.11 PM

భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మల్ జిల్లా: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. కుంటాల మండలం ఆర్లీ ఎక్స్ రోడ్డు వద్ద 61వ జాతీయ రహదారిపై లోకేశ్వరం మండలం రాజుర గ్రామ రైతులు శనివారం భారీ రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీల కొరత వేధిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా తూకాలు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అకాల వర్షాలు, ఈదురు గాలుల భయంతో ఆందోళన చెందుతున్నామని, పంటను కాపాడుకోవడానికి ఒక్కో గన్నీ సంచికి రూ.25 సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. “కలెక్టర్ రావాలి.. ఎమ్మెల్యే రావాలి.. మాకు న్యాయం చేయాలి” అంటూ నినాదాలతో హోరెత్తించారు. రైతుల ఆందోళనతో హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న లోకేశ్వరం తహశీల్దార్, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరతను తీర్చి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.