భారత్ సమాచార్.నెట్, నిర్మల్ జిల్లా: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. కుంటాల మండలం ఆర్లీ ఎక్స్ రోడ్డు వద్ద 61వ జాతీయ రహదారిపై లోకేశ్వరం మండలం రాజుర గ్రామ రైతులు శనివారం భారీ రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీల కొరత వేధిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల రోజులు గడుస్తున్నా తూకాలు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షాలు, ఈదురు గాలుల భయంతో ఆందోళన చెందుతున్నామని, పంటను కాపాడుకోవడానికి ఒక్కో గన్నీ…





