భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

వేసవి శిబిరంలో విద్యార్థులకు రాగిజావ పంపిణీ

WhatsApp Image 2026-05-09 at 7.45.13 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు స్థానిక పీహెచ్‌సీ ఏఎన్ఎం పొన్నం కవిత శనివారం రాగిజావ వితరణ చేశారు. వందేమాతరం ఫౌండేషన్, ఎన్ఎఫ్ హెచ్సి, వీఈడీసీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగుతోంది. దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, విద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ దార్ల రామ్మూర్తి, కోమటిపల్లి మాజీ సర్పంచ్ నీలం యాకయ్య, విద్యాపురం నాగేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు రాగిజావను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఎన్ఎం కవిత రాగిజావను అందించడం అభినందనీయమని కొనియాడారు. ఆమె సేవా భావం ఇతరులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేతమల్ల చంద్రయ్య, బూర రజినీకాంత్, ఏఎన్ఎం అల్లిక, ఆశా కార్యకర్తలు శ్రీలత, రాధ తదితరులు పాల్గొన్నారు.