భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్‌గా వరుసగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన ఇమ్మడి రాంరెడ్డిని పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ మండల యువజన నాయకుడు దొడ్డికాడి యశ్వంత్ తన బృందంతో కలిసి ఛైర్మన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ.. రాంరెడ్డి గారి నాయకత్వంలో యాదగిరిగుట్ట ప్రాంత రైతాంగానికి సహకార సంఘం ద్వారా మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ, చైర్మన్‌గా రెండో సారి బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
10, మే 2026, ఆదివారంభారత్ సమాచార్