భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, మే 2026, సోమవారంభారత్ సమాచార్

విద్యా వారోత్సవాలను విజయవంతం చేద్దాం: డీఈవో

WhatsApp Image 2026-05-10 at 8.45.02 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఏ. సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నెల్లికుదురు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో డీఈవో ఆదివారం పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. కేజీబీవీలో నూతనంగా నిర్మించనున్న అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణ స్థలాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం డీఈవో మాట్లాడుతూ.. విద్యా వారోత్సవాల తొలిరోజు కేజీబీవీలో అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు, నెల్లికుదురు మోడల్ స్కూల్‌లో వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములై విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్.సి సంతోష్, జి.సి.డి.ఒ. విజయ కుమారి, ఎస్‌వో సుమలత, ఎం.ఐ. ఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.