భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యా వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఏ. సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నెల్లికుదురు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ…