భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, మే 2026, మంగళవారంభారత్ సమాచార్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహణ

WhatsApp Image 2026-05-11 at 5.30.22 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తిలోని రాయరావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు, గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు పంపిణీ చేసిన ఐఎఫ్పీ, ఐడీపీ ప్యానెల్‌ను ప్రారంభించారు.
గ్రామ సర్పంచ్ ఆదర్శ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. మే 13 నుంచి 19 వరకు కళాశాలలో సప్లిమెంటరీ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని అన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి హాజరై పరీక్షలను సక్రమంగా రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.