భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, మే 2026, గురువారంభారత్ సమాచార్

పాఠశాలల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం

WhatsApp Image 2026-05-13 at 4.52.55 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించాలని తహశీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో బండారు పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని స్థానిక జడ్పీ హైస్కూల్‌లో విద్యా వారోత్సవాల సందర్భంగా సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంఈవో రూపారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధిలో గ్రామస్తుల భాగస్వామ్యాన్ని పెంచేలా సర్పంచులు చొరవ చూపాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి మెరుగైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని ఎంఈవో రూపారాణి వివరించారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు సర్పంచులు కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్ ఎస్. భాస్కర్ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.