భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యా వ్యవస్థ అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషించాలని తహశీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో బండారు పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని స్థానిక జడ్పీ హైస్కూల్లో విద్యా వారోత్సవాల సందర్భంగా సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంఈవో రూపారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ గీతాలాపనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధిలో గ్రామస్తుల భాగస్వామ్యాన్ని పెంచేలా సర్పంచులు చొరవ చూపాలని కోరారు.
…
పాఠశాలల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




