భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని శ్రీ వత్సల్ గురుకుల విద్యాలయంలో ఎకల్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షణ నైపుణ్య వర్గ (శిక్షణ తరగతులు) శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యా వికాసం, సామాజిక చైతన్యం లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ, కార్యకర్తల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఐదు రోజుల శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
మే 15 నుండి మే 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. శిబిరంలో భాగంగా కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో విద్యనందించే విధానాలు, వ్యక్తిత్వ వికాసం మరియు సామాజిక సేవా కార్యక్రమాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. మూడు రాష్ట్రాల నుండి వచ్చిన కార్యకర్తలతో గురుకుల ప్రాంగణం ఆధ్యాత్మిక, సేవా భావంతో సందడిగా మారింది. ఈ రోజు వర్గ ప్రారంభోత్సవం కావడం జరిగింది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవర్ ఓంకార్, నర్సాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బుచ్చెష్ యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరా రెడ్డి, గోడ రాజేందర్, కౌన్సిలర్ నిరంజన్ దాస్, నర్సాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రాల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, గురుకులం డైరెక్టర్ సురేష్, ప్రిన్సిపాల్ బాల జ్యోతి, ఏకల్ అభియాన్ సమితి సభ్యులు సంగారెడ్డి అంచల్ ప్రాథమిక శిక్ష ప్రబారి డాన్సింగ్, సంగారెడ్డి అంచల్ అధ్యక్షుడు అశోక్, నర్సాపూర్ సంచి కమిటీ దిగంబరు, ఏకల్ అభియాన్ కార్యకర్తలు ఓం ప్రకాష్, కర్తార్, రాఘవేందర్, కోటేశ్వర్, చంద్రశేఖర్, పాల్గొన్నారు.