భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని శ్రీ వత్సల్ గురుకుల విద్యాలయంలో ఎకల్ అభియాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షణ నైపుణ్య వర్గ (శిక్షణ తరగతులు) శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యా వికాసం, సామాజిక చైతన్యం లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ, కార్యకర్తల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ఐదు రోజుల శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

మే 15 నుండి మే 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల…