భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు

WhatsApp Image 2026-05-23 at 4.01.28 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: చిలిప్‌చెడ్ మండలం ఫైజాబాద్‌లోని సోమక్కపేట్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల ఇష్టారాజ్యం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ నెల 8న ఐదుగురు రైతులకు చెందిన 674 బస్తాల ధాన్యానికి ట్రక్ షీట్ రాసి రైస్ మిల్లుకు పంపారు. అయితే, మిల్లు వద్ద తూకంలో తేడాలొచ్చాయని సాకుతో, రైతులకు కనీస సమాచారం లేకుండా పాత ట్రక్ షీట్‌ను అధికారులు రద్దు చేశారు.

ఒక్కో రైతుకు ఒక బ్యాగు చొప్పున (మొత్తం 5 బస్తాలు) కోత విధిస్తూ కొత్త ట్రక్ షీట్ నమోదు చేశారు. మే 22 రాత్రి రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాక, లెక్కలు సరిపోకపోవడంతో ఈ మోసం బయటపడింది. దీనివల్ల రైతులకు రూ. 6,000 మేర నష్టం వాటిల్లింది. నష్టపోయిన సొమ్మును అధికారులే చెల్లించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ విలేకరులను ఆశ్రయించారు.