భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: చిలిప్‌చెడ్ మండలం ఫైజాబాద్‌లోని సోమక్కపేట్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల ఇష్టారాజ్యం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ నెల 8న ఐదుగురు రైతులకు చెందిన 674 బస్తాల ధాన్యానికి ట్రక్ షీట్ రాసి రైస్ మిల్లుకు పంపారు. అయితే, మిల్లు వద్ద తూకంలో తేడాలొచ్చాయని సాకుతో, రైతులకు కనీస సమాచారం లేకుండా పాత ట్రక్ షీట్‌ను అధికారులు రద్దు చేశారు.
ఒక్కో రైతుకు ఒక బ్యాగు చొప్పున (మొత్తం 5 బస్తాలు) కోత విధిస్తూ కొత్త ట్రక్…





