భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, మే 2026, సోమవారంభారత్ సమాచార్

జనగణన సర్వే విధులపై ఉపాధ్యాయుల ఆవేదన

WhatsApp Image 2026-05-24 at 6.56.27 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న “జనగణన సమగ్ర సర్వే” పుణ్యమా అని ఉపాధ్యాయుల బతుకు భారంగా మారింది. బడిలో పాఠాలు చెప్పాల్సిన గురువులు.. ఇప్పుడు చేతిలో ట్యాబ్‌లు పట్టుకుని వీధుల వెంట తిరగాల్సి వస్తోంది. పగటిపూట జనం ఇళ్లలో ఉండకపోవడంతో రాత్రి 9 గంటల వరకు సర్వేలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు చీకటి పడ్డాక తెలియని ప్రాంతాల్లో తిరుగుతూ మానసిక నరకాన్ని అనుభవిస్తున్నారు.

మరోవైపు సర్వే యాప్ తరచూ ‘హ్యాంగ్’ అవుతుండటంతో ఒక్కో ఇంటి వద్ద గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఆధార్, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అడుగుతుండటంతో.. పథకాలు కట్ చేస్తారనే భయంతో జనం ఉపాధ్యాయులపై తిట్లు, అవమానాలకు దిగుతున్నారు. అన్ని బోధనేతర పనులకు ఉపాధ్యాయులనే వాడటం వల్ల ప్రభుత్వ బడుల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమను సర్వేల భారం నుండి తప్పించి చదువు చెప్పనివ్వాలని వారు కోరుతున్నారు.