భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా సాగుతున్న “జనగణన సమగ్ర సర్వే” పుణ్యమా అని ఉపాధ్యాయుల బతుకు భారంగా మారింది. బడిలో పాఠాలు చెప్పాల్సిన గురువులు.. ఇప్పుడు చేతిలో ట్యాబ్లు పట్టుకుని వీధుల వెంట తిరగాల్సి వస్తోంది. పగటిపూట జనం ఇళ్లలో ఉండకపోవడంతో రాత్రి 9 గంటల వరకు సర్వేలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు చీకటి పడ్డాక తెలియని ప్రాంతాల్లో తిరుగుతూ మానసిక నరకాన్ని అనుభవిస్తున్నారు.
మరోవైపు సర్వే యాప్ తరచూ ‘హ్యాంగ్’ అవుతుండటంతో ఒక్కో ఇంటి వద్ద గంటల తరబడి…





