భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ కేంద్రం వద్ద రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, రైతులను మోసం చేస్తున్నారని రైతుల పండించిన పంటలను కొనడం లేదని మండిపడ్డారు. పంటల కొనుగోలు ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంత్రంగా జరుగుతుందని తెలిపారు. ఎమ్మెస్పీ ధర నిర్ణయించడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలంగాణలో ఎంత ధాన్యం పండిందనే కేంద్రానికి నివేదిక అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫల మయ్యిందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉండి మళ్లీ రైతుల వద్దకు బీజేపీ రాష్ట్ర నాయకులు వచ్చి ముసలి కన్నీరు కార్చడం సిగ్గుమాలిన చర్య అంటూ గజ్వేల్ బిఆరెస్ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రైతుల పంటను కొనుగోలు చేయాలని రైతులకు మద్దతుగా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నేడు బీఆర్ఎస్ రైతు దీక్ష, వంటావార్పు నిర్వహించారు. ఒకటో తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తాం అని రైతులను ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రైతు పండించి ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు, ఎమ్మెస్పీ డిక్లేర్ చేయకపోవడం బాధాకరం అని రైతన్నల సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవని, కార్పొరేట్ బడా బాబులను రక్షించడమే నరేంద్ర మోడీ విధానమని మండిపడ్డారు. రైతుల వద్దకు రాష్ట్ర బీజేపీ నేతలు వచ్చి ముసలి కన్నీరు కార్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 45 డిగ్రీల ఎండలో రైతులు పిల్ల పాపలతో కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నారని.. కనీసం వారికి కనీస సౌకర్యాలను కూడా కల్పించలేని దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల్లో ఒక గోదాం కూడా కట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు రైతులంటే వెన్నుముక అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టింది.. రైతుల కోసం అని రైతుల పార్టీ అని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గింజను కొనుగోలు చేయాలని మార్కెట్ వద్ద రైతు దీక్షకు బీఆర్ఎస్ సిద్ధమైందని పేర్కొన్నారు. రైతు దీక్షకు ఆర్డీవో, కలెక్టర్, అధికారులు రావాలని అధికారులు చొరవచూపకపోతే రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తాం అంటూ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు బాధ్యతను విస్మరించి బాధ్యతారహితంగా వివక్ష చూపడం చాలా దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు, అంబరి రామచంద్రం, అనంతుల ప్రశాంత్, పీఎసీఎస్ చైర్మన్లు బట్టు అంజిరెడ్డి, ఆలేటి ఇంద్రసేనారెడ్డి, యూత్ వి నాయకుడు జుబేర్ పాషా ఎంపీపీలు పాండుగౌడ్, రమేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, అమరేందర్, మనోహరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్, మాజీ ఎంపీటీసీ పొట్టోల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అర్జున్ గౌడ్, పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
27, మే 2026, బుధవారంభారత్ సమాచార్