భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ కేంద్రం వద్ద రైతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, రైతులను మోసం చేస్తున్నారని రైతుల పండించిన పంటలను కొనడం లేదని మండిపడ్డారు. పంటల కొనుగోలు ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో తూతూ మంత్రంగా జరుగుతుందని తెలిపారు. ఎమ్మెస్పీ ధర నిర్ణయించడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలంగాణలో ఎంత ధాన్యం…