భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: హైదరాబాదులోని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటిపై ఆంధ్ర పోలీసులు వెళ్లడంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పోలీసుల పెత్తనం ఏమిటని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి ఎమ్మెల్యే సామేలు మాట్లాడుతూ హైదరాబాదులో ఇంకా మీ అయ్య జాగీరు ఉందా.. ఇక్కడ మీ పెత్తనం ఏంటి అని మండిపడ్డారు. సిగ్గు, శరం ఉంటే ఆంధ్రాకి తరలి వెళ్లాలని అన్నారు. తెలంగాణ మేధావుల, సామాజిక ఉద్యమకారులపై ఆంధ్ర నాయకుల పెత్తనం ఏంటని, మీ అరాచకం తెలంగాణలో నడవదని అన్నారు. ఆంధ్ర వాళ్లకు తెలంగాణలో ఏం పని బతకడానికి వచ్చి, పెత్తనం ఏంటన్నారు. మా మీద ఆంధ్ర పెత్తనం చేస్తే ఊరుకునేది లేదని..ఎమ్మెల్యే సామేలు మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణతో పెట్టుకుంటే ఆ ఏడుపు ఏందో అమరావతిలో ఏడవాలని చంద్రబాబుకు సామేలు సూచించారు. తెలంగాణ ప్రజానీకంపై ఆంధ్ర నాయకుల పెత్తనం చేస్తే మరోసారి తిరుగుబాటు చేస్తామన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
28, మే 2026, గురువారంభారత్ సమాచార్