భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: గతంతో పోలిస్తే పంట దిగుబడి పెరగడం వల్లే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు లేకుండా కేవలం పార్టీ కార్యకర్తలతోనే ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అకాల వర్షాల వల్ల నష్టం జరగకుండా తూప్రాన్‌లో పెద్ద గోదాం తీసుకుని ధాన్యం తరలిస్తున్నట్లు తెలిపారు. కష్టకాలంలో రాజకీయాలు పక్కనబెట్టి సహకరించాలే తప్ప రైతులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, సీనియర్ నాయకుడు సీతయ్య, కృష్ణ, మైసయ్య, బంజే రవి, శివలింగం, ఉపసర్పంచ్ నవీన్ యాదవ్, శేరిల్లా విలేజ్ అధ్యక్షుడు బండ దాకుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.