భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: గతంతో పోలిస్తే పంట దిగుబడి పెరగడం వల్లే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని, దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి విమర్శించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులు లేకుండా కేవలం పార్టీ కార్యకర్తలతోనే ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అకాల వర్షాల వల్ల నష్టం జరగకుండా తూప్రాన్‌లో…





