భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన భరోసా కార్యక్రమ కన్వర్జెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా భరోసా కేంద్రాల ద్వారా ఒకే వేదికపై వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సహాయం అందేలా చూడాలన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. బాధితులకు సేవలు అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ , డీఎస్పీ ప్రసన్న కుమార్, భరోసా కోఆర్డినేటర్ సౌమ్య, చైల్డ్‌లైన్ ప్రతినిధులు, సీడబ్ల్యూసీ, జేజేబీ సభ్యులు, డీఎల్ఎస్ఏ ప్రతినిధులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు, ఎస్ఈఆర్పీ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దర్యాప్తు అధికారులు, షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
6, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్