భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన భరోసా కార్యక్రమ కన్వర్జెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా భరోసా కేంద్రాల ద్వారా ఒకే వేదికపై వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సహాయం అందేలా చూడాలన్నారు.…