భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్

మాసాయిపేటలో కొత్త ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి

WhatsApp Image 2026-06-05 at 4.55.09 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పిల్లల భవిష్యత్తు, ప్రాణ రక్షణను దృష్టిలో పెట్టుకుని మాసాయిపేట మండల కేంద్రంలో తక్షణమే నూతన ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటే చిన్నపిల్లలు ప్రమాదకరమైన జాతీయ రహదారిని దాటాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు దాటే క్రమంలో నిరంతరం వాహనాల రాకపోకలతో చిన్నపిల్లలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, దీంతో తల్లిదండ్రులు తమ పనులకు వెళ్లకుండా భయాందోళన చెందుతున్నారని తెలిపారు. దరిపల్లి రూట్‌లోని బ్రిడ్జి మార్గం గుండా వెళ్దామన్నా, వర్షాకాలంలో అక్కడ నీరు నిలిచిపోయి పిల్లలు నడవలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఐదో తరగతి లోపు ఉన్న విద్యార్థుల ఇబ్బందులను గమనించి, హైవేకి ఇవతలి వైపున కొత్త ప్రాథమిక పాఠశాలను మంజూరు చేయాలని కోరారు. తద్వారా నిరుపేద పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో విద్య అందుతుందని, ప్రభుత్వం ఈ విషయమై త్వరితగతిన స్పందించాలని యాదగిరి మాదిగ విజ్ఞప్తి చేశారు.