భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పిల్లల భవిష్యత్తు, ప్రాణ రక్షణను దృష్టిలో పెట్టుకుని మాసాయిపేట మండల కేంద్రంలో తక్షణమే నూతన ప్రైమరీ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటే చిన్నపిల్లలు ప్రమాదకరమైన జాతీయ రహదారిని దాటాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు దాటే క్రమంలో నిరంతరం వాహనాల రాకపోకలతో చిన్నపిల్లలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, దీంతో తల్లిదండ్రులు తమ పనులకు వెళ్లకుండా భయాందోళన చెందుతున్నారని…