భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జూన్ 2026, గురువారంభారత్ సమాచార్

నర్సాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

WhatsApp Image 2026-06-10 at 6.04.42 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలో వార్డు సభలు జోరుగా సాగుతున్నాయి. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు దశలవారీగా జరుగుతున్న ఈ సభల్లో భాగంగా శనివారం 7, 8, 9, 15వ వార్డులలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మి రాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో ఈ సభలు జరిగాయి.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వార్డు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు పురపాలక సంఘం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ వనముల బుచ్చెష్ యాదవ్, కౌన్సిలర్లు మహమ్మద్ మోయిజుద్దీన్, చింతకుంట శ్రీకాంత్, వంటేద్దు సునీత బాల్ రెడ్డి, పంబల్ల లలిత భిక్షపతి, మేనేజర్ వైట్ల మధుసూదన్, సబ్ ఇన్‌స్పెక్టర్ చెల్మెటి జగన్నాథం, వార్డు అధికారులు, మున్సిపల్, మెప్మా సిబ్బంది, సంబంధిత వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.