భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

14, జూన్ 2026, ఆదివారంభారత్ సమాచార్

అర్వపల్లిలో BLAలు, సభ్యత్వ ఇంచార్జీల సమావేశం

WhatsApp Image 2026-06-13 at 6.57.15 PM

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ఈ నెల 15వ తేదీన సోమవారం అర్వపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో మాజీ శాసనసభ్యులు కిషోర్ అన్న అధ్యక్షతన నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లు, BRS డిజిటల్ సభ్యత్వ ఇంఛార్జ్‌ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జ్‌ రాష్ట్ర BRS కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నియోజక వర్గం సభ్యత్వ ఇంఛార్జ్‌ యలగందుల వెంకటేశ్వర్లు హాజరు కానున్నారు. ప్రతీ గ్రామం నుంచి పేర్లు పంపిన బూత్ ఏజెంట్, సభ్యత్వ ఇంఛార్జ్‌, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు మండల, గ్రామ పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరు కాగలరని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పూర్తిగా విఫలమైందన్నారు. వర్షాకాలం ప్రారంభం అయి 20 రోజులు అవుతున్న వ్యవసాయ శాఖ ప్రణాళిక మీద స్థానిక MLA కానీ, జిల్లా మంత్రి కానీ ఇంతవరకు రివ్యూ జరిపలేదని తెలిపారు. గత రెండున్నర ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేఖ, ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తుందన్నారు. కావున కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పేందుకు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు బాధ్యతగా సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గోపగాని రమేష్, సర్పంచ్ ఎల్లయ్య, నాగమల్లు, వెంకటేష్, Town ప్రెసిడెంట్ గోపగాని శ్రీనివాస్, గోపగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.